భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని జలీల్ పుర మసీదు కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జయంతి (ఈద్ మిలాద్–ఉన్–నబీ) వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జలీల్ పుర మసీదు నుంచి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్స్‌కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ముఖ్యులు ప్రసంగించారు. మహమ్మద్ ప్రవక్త చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్‌తో పాటు పోలీసు సిబ్బందిని కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అబ్దుల్ రహీమ్, అవేస్ చిస్తీ, ఇక్బాల్ చౌదరి, ముష్టక్ చౌదరి, ముస్తఫా ఖాద్రి, కార్యదర్శి కాజం అహ్మద్, రహీముద్దీన్, ఇంతియాజ్, సుజావృద్దీన్, ఫహీం, గౌస్, టూఫీక్, ఖాదర్, సైఫుల్లా, అఫ్రోజ్, ఇలియాస్, సమీర్, జలీల్, బుర్హాన్, రామచంద్రయ్య పాల్గొన్నారు.


