నాగార్జునసాగర్: రాష్ట్ర చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ మంగళవారం నాగార్జునసాగర్‌కు చేరుకుంది. సాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహం వద్ద వీరికి మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభ్యులు స్థానిక బీసీ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, గురుకులంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై బీసీ గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ స్వప్న, ప్రిన్సిపాల్ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి విద్యార్థులతో నేరుగా మాట్లాడి పాఠశాలలో అందుతున్న వసతులు భోజనం, విద్యా సౌకర్యాలు, ఇతర సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విజయవిహార్ సమావేశ మందిరంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులతో కమిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకం కింద నల్లగొండ జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై కమిషన్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్, గోగుల సరిత, మర్రిపల్లి చందన, బండి అపర్ణ, ప్రేమలత అగర్వాల్, పెద్దవూర ఎంఈఓ తరి రాము, సాగర్ సీఐ శ్రీనునాయక్, ఎస్‌ఐ సతీష్, ఆర్‌ఐ దండ శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
ఫ చైల్డ్‌రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి


