యాదగిరిగుట్ట రూరల్: వీబీజీ రామ్‌జీ పథకంలో భాగంగా చేపట్టిన జలసరి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. సోమవారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో ఫామ్ పాండ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి సంఖ్యను పెంచేలా కృషి చేయాలన్నారు. ఫామ్ పాండ్స్, సోక్ పిట్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, బోర్వెల్ రీచార్జ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పనులకు గ్రామానికి ఇద్దరు ఇన్‌చార్జ్ అధికారుల చొప్పున నియమించుకోవాలని సూచించారు. ప్రతీ గ్రామంలో రెండు ఫామ్ పాండ్స్ నిర్మించాలన్నారు. అంతకు ముందు ప్రజావాణి జరుగుతున్న తీరును పరిశీలన చేశారు. ప్రతీ ఒక్కరి సమస్యను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయాధికారిణి సుధారాణి, ఈసీ రాజశేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


