రామన్నపేట: నేటి తరం జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ ఎండీ ఇబ్రహీంను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. సోమవారం రామన్నపేటలో పాత్రికేయుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టు ఎండీ ఇబ్రహీం సంతాపసభలో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఇబ్రహీం చిత్రపటానికి నివాళులర్పించారు. బూరుగు వెంకటేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, మార్కెట్ వైస్‌చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నార్మాక్స్ డైరెక్టర్ మందడి ప్రభాకర్‌రెడ్డి, టీయూడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బసవపున్నయ్య, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎలిమినేటి జహంగీర్, వివిధపార్టీల మండల అధ్యక్షులు పున్న జగన్మోహన్, పోచబోయిన మల్లేశం, బొడ్డుపల్లి వెంకటేశం, ఊట్కూరి నర్సింహ, మీర్జా ఫజల్‌బేగ్, నకిరేకంటి నరేష్, సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, ఉపసర్పంచ్ మోటె రమేష్, ఎండీ జమీరొద్దీన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ వేముల వీరేశం


