భువనగిరిటౌన్ : ప్రజల సమస్యల పరిష్కారానికి, పట్టణ సమగ్ర అభివృద్ధికి పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. భువనగిరి మున్సిపాలిటీలోని 25వ వార్డులో రూ.2లక్షల మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో చేపట్టనున్న మురుగు కాలువపై స్లాబ్ నిర్మాణ పనులకు, 11వ వార్డులో రూ.2లక్షల వ్యయంతో చేపట్టే అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను ఆమె కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు బెండె స్వరూప లాల్ రాజ్, గంజి శ్రీవాణి గణేష్‌లతో పాటు స్థానిక నాయకులు, వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


