ఎయిమ్స్‌లో ‘ఆక్యుపేషనల్‌ థెరపీ’ సేవలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌లో ‘ఆక్యుపేషనల్‌ థెరపీ’ సేవలు ప్రారంభం

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

భువనగిరి (బీబీనగర్‌): బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్యుపేషనల్‌ థెరపీ, సెన్సరీ ఇంటిగ్రేషన్‌ యూనిట్లను హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అమితా అగర్వాల్‌ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ వంటి రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు, పక్షవాతం, నాడీ సంబంధ రుగ్మతలున్న రోగులకు ఈ యూనిట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎయిమ్స్‌ వైద్యులు మహేశ్వర్‌, డాక్టర్‌ లక్కీరెడ్డి, డాక్టర్‌ పట్నాయక్‌, డాక్టర్‌ కృష్ణ, డాక్టర్‌ ఎ.ఎస్‌. గోవింద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement