యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, నిత్య కల్యాణ మండపం వంటి ప్రాంతాల్లో భక్తులు కిటకిటలాడారు. స్వామివారి ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి వారిని 35వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో స్వామి వారికి నిత్యాదాయం రూ.44,71,561 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. లక్ష్మీనరసింహస్వామిని అమెరికాలోని డల్లాస్‌కు చెందిన వ్యక్తి ఆదివారం దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులలో వచ్చిన అతడితో పలువురు భక్తులు ఫొటోలు దిగుతూ కనిపించారు.


