ఎనిమిదేళ్ల క్రితం నాలుగు ఎకరాల్లో కలబంద సాగు చేశాను. వీటిని హైదరబాద్‌లోని జ్యూస్ దుకాణాల వారికి విక్రయిస్తా. ఏడాదికి నాకు రూ. 50వేల ఆదా యం వస్తుంది. జామ మొక్కలు నాటాను. దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది.
– జాజుల బుచ్చిరాములు, కోతులారం
సంప్రదాయ పంటలు కాకుండా వాణిజ్య పంటలపై దృష్టి సారించా. ప్రధానంగా మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటగా కలబందను పెంచుతున్నా. కలబందను ఫార్మా, జ్యూస్, సౌందర్య సాధనాలలో వినియోగిస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంటతో ఎలాంటి రిస్క్ ఉండదు.
– తేలుకుంట్ల రామ్మూర్తి, పాటిమట్ల


