న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళన | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట ఆందోళన

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

మర్రిగూడ : కొన్ని రోజుల క్రితం మర్రి గూడ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు వచ్చిన కురిమళ్ల చంద్రయ్య అనే రోగికి ఆస్పత్రి సిబ్బంది తాగునీటికి బదులుగా యాసిడ్‌ ఇచ్చిన ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు మంగళవారం సీహెచ్‌సీ ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శంకర్‌నాయక్‌ ఎదుట నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాంబాబు అక్కడకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ప్రస్తుతం చంద్రయ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement