విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నశా ముక్త్‌ భారత్‌ | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నశా ముక్త్‌ భారత్‌

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దేశ్‌ముఖిలో గల విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మంగళవారం నశా ముక్త్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధి డాక్టర్‌ శ్రీలత, యూనివర్సిటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ దాసేశ్వర్‌రావు మాట్లాడుతూ.. డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి అందరూ పాటుపడాలని అన్నారు. క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి బలమైన సమాజానికి పునాది అన్నారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్‌లు, ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement