నకిలీ హైడ్రాలిక్‌ ఆయిల్‌ డబ్బాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నకిలీ హైడ్రాలిక్‌ ఆయిల్‌ డబ్బాలు స్వాధీనం

Aug 19 2026 1:18 AM | Updated on Aug 19 2026 1:18 AM

హుజూర్‌నగర్‌ : హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ెహెచ్‌పీసీఎల్‌) కంపెనీ పేరుతో హుజూర్‌నగర్‌లో నకిలీ హైడ్రాలిక్‌ ఆయిల్‌ డబ్బాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో సీసీఎస్‌ పోలీసులు, ఆ కంపెనీ ప్రతినిధులు మంగళవారం పట్టణంలోని పలు ఆటోమొబైల్‌ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా కోదాడ రోడ్డులోని ఆటోమొబైల్లో షాపులలో తనిఖీలు చేపట్టి రెండు దుకాణాల నుంచి 28 నకిలీ హైడ్రాలిక్‌ ఆయిల్‌ డబ్బాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్‌ చేసి హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నకిలీ హైడ్రాలిక్‌ ఆయిల్‌ డబ్బాలు విక్రయిస్తున్న షాపుల యజమానులను సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు హుజూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement