మహిళా ఉపాధికి ‘సీ్త్రనిధి’ | - | Sakshi
Sakshi News home page

మహిళా ఉపాధికి ‘సీ్త్రనిధి’

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళల ఉన్నతే లక్ష్యంగా పని చేస్తున్నాం. రుణాలు పొందిన సభ్యులు యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలి. సకాలంలో వాయిదాలు చెల్లించాలి. ద్విచక్రవాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీపై రుణాలు పొందవచ్చు.

– కట్ట వెంకటేశం, డీపీఓ

ఆలేరురూరల్‌ : వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు సీ్త్రనిధి ద్వారా ఈ–ఆటో, ద్విచక్రవాహనాల కొనుగోలుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. వాహనాల నుంచి వెలువడే పొగ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించింది.

ఈ–వాహనాలతో స్వయం ఉపాధి

రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు మహిళా సంఘాల సభ్యులకు రుణాలు అందజేస్తోంది. వీటితో మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

సులభ వాయిదాల్లో చెల్లింపులు

ఈ–ఆటోకు రూ.2.74 లక్షలు, ఈ–ట్రాలీ వాహనాలకు ప్రభుత్వం రూ.3లక్షల వరకు రుణాలు అందించాలని నిర్ణయించింది. 60 నెలల సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 11 శాతం వార్షిక వడ్డీకే రుణాలు అందజేస్తారు. ఎలక్ట్రిక్‌ ఆటోలో 5 మంది వరకు ప్రయాణించవచ్చు. రోజుకు రెండు గంటలు చార్జింగ్‌ పెడితే 100 కిలో మీటర్లు ప్రయాణించేందుకు వీలుంటుంది. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కొనుగోలుకు గరిష్టంగా రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. 48 వాయిదాలతో వీటిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సంఘాల సభ్యులకు గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ప్రజా రవాణాకు అవసరమైన ఈ–ఆటోల ద్వారా మహిళలు ఉపాధి పొందవచ్చు. ఎలక్ట్రిక్‌ బైక్‌ల ద్వారా డెలివరీ సేవలు, ఫీల్డ్‌ వర్క్‌ చిన్న వ్యాపారాల వంటివి చేసుకునే అవకాశం ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ వ్యయం తగ్గించి తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు అప్పుల బారిన పడకుండా తక్కువ వడ్డీతో సంస్థాగత రుణాలు పొందవచ్చు.

ఫ ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు రుణాలు

ఫ ఈ–బైక్‌, ఆటోలు, ట్రాలీలకు రూ.లక్ష నుంచి రూ.3.13 లక్షల వరకు..

ఫ 11 శాతం వార్షిక వడ్డీతో అందించేలా ప్రణాళిక

ఫ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ నిర్ణయం

మహిళా సంఘాలు వివరాలు

మండల సమాఖ్యలు 17

గ్రామైక్య సంఘాలు 652

ఎస్‌హెచ్‌జీలు 15,439

సభ్యుల సంఖ్య 1,62,546

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement