26,163 ఓట్లు గల్లంతే.. | - | Sakshi
Sakshi News home page

26,163 ఓట్లు గల్లంతే..

Aug 11 2026 2:00 AM | Updated on Aug 11 2026 2:00 AM

సాక్షి, యాదాద్రి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ సోమవారం అర్ధరాత్రితో ముగిసింది. ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ జిల్లాలో 94.3 శాతం పూర్తయ్యింది. ఈప్రక్రియలో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు.

4,33,745 మంది ఫారాలు డిజిటలైజేషన్‌

జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో 4,59,943 ఓటర్లు ఉండగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను 566మంది బీఎల్‌ఓలు చేపట్టారు. వీరు 4,33,745 మంది ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్‌ చేశారు. అంటే 94.3 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి అయ్యింది. 26,197 ఫారాలను సేకరించలేకపోయారు. 84,333 ఫారాలు తప్పుగా నమోదైయ్యాయి. ఈ ప్రక్రియలో జిల్లాలో దాదాపు 26,163 ఓట్లు గల్లంతయ్యే అవకాశం కన్పిస్తోంది. అన్‌కలెక్టబుల్‌ ఓట్ల కోసం మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తారు.

ముగిసిన పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌

ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఒక పోలింగ్‌ కేంద్రంలో 1,200 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే మరో పొలింగ్‌కేంద్రం ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఇందులో భాగంగా ఆలేరులో 4 , భువనగిరిలో 5 పోలింగ్‌కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం, లప్పానాయక్‌ తండా, మాసాయిపేట, ఆలేరులో గుండ్లగూడెం, ఆత్మకూర్‌ (ఎం) మండలం పల్లెపహాడ్‌ ఉన్నాయి. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి నియోజకవర్గంలోని బండసోమారం, బీబీనగర్‌ మండలంలోని గూడూరు, కొండమడుగు, పడమటి సోమారం, చిన్నరావులపల్లిల్లో కొత్త పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఫ ముగిసిన సర్‌ ప్రక్రియ

ఫ 94.3శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

ఫ రాష్ట్రంలోనే జిల్లా టాప్‌

ఫ 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల

ఫ తొమ్మిది కొత్త పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement