వెంటనే కళాశాలకు చేరవేస్తాం
రామన్నపేట: ప్రభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంటర్ విద్యను సర్వశిక్ష అభియాన్‌కింద చేర్చడంతో పాఠశాల విద్యార్థుల మాదిరిగానే ఇంటర్ పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు ఒక్కొక్కరికి 200పేజీలు గల 12 నోట్‌బుక్స్ అందించనున్నారు.
12 ప్రభుత్వ కళాశాలల్లో..
ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రఽభుత్వ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేసేందుకు ఇంటర్‌బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 12 ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 3,698 మంది పేద విద్యార్థులకు 44,376 నోట్ బుక్స్ అవసరం ఉన్నాయి. ఇప్పటికే కళాశాల వారీగా అవసరమైన ఇండెంట్‌ను అధికారులకు జిల్లా యంత్రాంగం పంపించింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లాకు నోట్‌బుక్స్ చేరనున్నాయి.విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.
మధ్యాహ్న భోజన పథకం
అమలుకు న్యూట్రిషన్ కమిటీలు
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 11 కళాశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కమిటీలను ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఫ ఒక్కొక్కరికి 12 నోట్‌బుక్స్ చొప్పున అందించేలా ఇండెంట్
ఫ 44వేల నోట్ బుక్స్ అవసరం
ఫ 3,698 మంది విద్యార్థులకు లబ్ధి
జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు 44,376 నోట్ బుక్స్ అవసరం. ఈ మేరకు ఇండెంట్ పెట్టాం. ఇప్పటికే కొన్ని జిల్లాలకు చేరాయి. మన జిల్లాకు కూడా నోట్‌బుక్స్ డెలివరీ అయినట్లు సమాచారం వచ్చింది. నోట్‌బుక్స్ వచ్చిన వెంటనే కళాశాలకు చేరవేసి పంపిణీ చేస్తాం.
– బొందుగుల సురేష్, జిల్లా ఇంటర్‌బోర్డు అధికారి


