సాక్షి, యాదాద్రి : నృసింహసాగర్(బస్వాపూర్) ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం రూ.140 కోట్లు విడుదల చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం నాగార్జున సాగర్‌లో నిర్వహించిన వరుణ యాగానికి సీఎంతోపాటు ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రాజెక్టు పూర్తి అయినప్పటికీ ముంపు గ్రామమైన బీఎన్ తిమ్మాపూర్‌కు పరిహారం ఇవ్వలేకపోయామని సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన సీఎం ఆర్థిక శాఖముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారన్నారు. వారంలో పరిహారం డబ్బులు రానున్నట్లు తెలిపారు. పరిహారం ఇచ్చి గ్రామాన్ని అక్కడినుంచి తొలగిస్తే రిజర్వాయర్‌లో 9 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయవచ్చని చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాగా పరిహారం చెల్లిస్తే ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సాగు, తాగు నీటి కష్టాలుతీరుతాయని ఆయన పేర్కొన్నారు.


