యాదగిరిగుట్ట రూరల్ : మాజీ సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టను చాలా బాగా అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ పాలనలో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని స్వయంభూవులను దర్శించుకుని మొక్కులు చెల్లించి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖమండపంలోని ఉత్సవమూర్తుల వద్ద అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని లక్ష్మీనరసింహస్వామి వారిని మొక్కుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే
చామకూర మల్లారెడ్డి


