మర్రిగూడ : కుక్కను తప్పించబోయి ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో జరిగింది. ఛత్తీస్‌గడ్‌కు చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం మర్రిగూడ మండల కేంద్రానికి వలస వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలో పనులు ముగించుకుని ఆటోలో మండల కేంద్రానికి వస్తుండగా.. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోకి రాగానే కుక్క అడ్డురావడంతో దానిని తప్పించబోయి ఆటో డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఛత్తీస్‌గడ్‌కు చెందిన పరమేశ్వర్, కుమారి, రూపాబాయి, పురందాస్, మాల్‌కు చెందిన పవన్, సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురానికి చెందిన ద్వాలి, మర్రిగూడ మండలం తిరగండ్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ కలకొండ సిద్ధుకు గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మర్రిగూడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుమారి, పరమేశ్వర్, రూపాబాయి, పురందాస్‌ను నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏడుగురికి గాయాలు


