రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

రామన్నపేట : ప్రభుత్వం రైతులకు 24గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్‌ చేశారు. అప్రకటిత విద్యుత్‌ కోతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రామన్నపేట సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకో చేశారు. భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో సీఐ రవి, ఎస్‌ఐ సతీష్‌ వారితో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అప్రకటిత విద్యుత్‌ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్రమైన జాప్యం, యాప్‌ల పేరుతో యూరియా ఇబ్బందులు, అప్రకటిత విద్యుత్‌ కోతలతో రైతులకు వ్యవసాయంపై విరక్తి కలిగేలా రేవంత్‌రెడ్డి చేస్తున్నాడని దుయ్యబట్టారు. విద్యుత్‌ వినియోగం తగ్గినా కరెంటు కోతలు ఎందుకు విధిస్తున్నారో కాంగ్రెస్‌ నేతలు రైతులకు సమాధానం చెప్పాలన్నారు. వరినాట్లు వేసిన తర్వాత విద్యుత్‌ కోతలు విధించడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులకు 24గంటల కరెంటు ఇవ్వకపోతే ఎస్‌ఈ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కమ్మంపాటి శ్రీనివాసులు, గర్దాసు విక్రం, నాయకులు పోచబోయిన మల్లేశం, బందెల రాములు, బద్దుల ఉమారమేష్‌, కన్నెబోయిన బలరాం, ఆమేర్‌, పున్న వెంకటేశం, రేఖ యాదయ్య, మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, కూనూరు ముత్తయ్య, అంజి, మామిండ్ల కుమార్‌, బండ శ్రీనివాస్‌రెడ్డి, నక్క నరేందర్‌, బుర్ర శ్రీశైలం, జాడ సంతోష్‌, కోళ్ల కిషన్‌, కల్లూరి నరేష్‌, బొడ్డుపల్లి రాజు, కుమార్‌, రవి పాల్గొన్నారు.

ఫ నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే

చిరుమర్తి లింగయ్య

ఫ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో

రామన్నపేట సబ్‌స్టేషన్‌ ముట్టడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement