యువకుడి ప్రాణం తీసిన డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి ప్రాణం తీసిన డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యం

Aug 10 2026 1:58 AM | Updated on Aug 10 2026 1:58 AM

నకిరేకల్‌ : డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నకిరేకల్‌ పట్టణ శివారులో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వేణిగుండ్ల గ్రామానికి చెందిన భీమిరెడ్డి హేమంత్‌కిరణ్‌రెడ్డి(30) హైదరాబాద్‌లో ఉంటూ సివిల్‌ సైట్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నాడు. సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వెళ్లిన హేమంత్‌ కిరణ్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నకిరేకల్‌ పట్టణ శివారులోని పద్మానగర్‌ జంక్షన్‌ వద్దకు రాగానే.. నకిరేకల్‌ పట్టణంలో నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న డీసీఎం డ్రైవర్‌ ఎటువంటి సిగ్నల్‌ ఇవ్వకుండా అకస్మాత్తుగా హైవే పైకి వచ్చాడు. దీంతో హేమంత్‌ కిరణ్‌రెడ్డి బైక్‌ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హేమంత్‌ కిరణ్‌రెడ్డి మృతదేహాన్ని నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి తరించారు. డీసీఎం నడుపుతున్న వ్యక్తి కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెంకు చెందిన నిమ్మనగోటి శేఖర్‌గా పోలీసులు గుర్తించారు. మృతుడి బావమరిది పులగం వేణుగోపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ హరిబాబు తెలిపారు.

ఎటువంటి సిగ్నల్‌ ఇవ్వకుండా

అకస్మాత్తుగా హైవే పైకి వచ్చిన డీసీఎం

వెనుక నుంచి ఢీకొన్న ద్విచక్ర వాహనం

నకిరేకల్‌ పట్టణ శివారులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement