కొత్త ‘చేయూత’కు మార్గదర్శకాలు ఇవే.. | - | Sakshi
Sakshi News home page

కొత్త ‘చేయూత’కు మార్గదర్శకాలు ఇవే..

Aug 9 2026 2:34 AM | Updated on Aug 9 2026 2:34 AM

దరఖాస్తుకు ఈ పత్రాలు తప్పనిసరి

పింఛన్ల ఎంపికకు గైడ్‌లైన్స్‌

విడుదల చేసిన ప్రభుత్వం

ఈ నెల 15న కొత్త

పింఛన్‌దారుల ఎంపిక

జిల్లా కలెక్టర్లకు అందిన

ప్రభుత్వ ఆదేశాలు

అర్హతలు, అనర్హతలపై

స్పష్టతనిచ్చిన సర్కారు

ఫ పూర్తిచేసిన అప్లికేషన్‌ ఫారం

ఫ ఆధార్‌ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం

ఫ రేషన్‌ కార్డు లేదా ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు

ఫ రెవెన్యూ శాఖ జారీ చేసిన

ఆదాయ ధ్రువీకరణ పత్రం

ఫ బ్యాంకు ఖాతా (పాస్‌బుక్‌) మొదటి

పేజీ జిరాక్స్‌

సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో కొత్త శ్రీచేయూతశ్రీ పింఛన్ల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్‌ రోగులు, దివ్యాంగులతో పాటు తలసేమియా, సికిల్‌ సెల్‌ డిసీజ్‌, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా పింఛన్లు ఇవ్వనున్నారు. ఈ నెల 15న కొత్త పింఛన్‌దారులను ఎంపిక చేస్తారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

వీరు అర్హులు..

వితంతువులు (రూ.2,016): 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి.

ఒంటరి మహిళలు (రూ.2,016): వివాహిత మ హిళలైతే 18 ఏళ్లు నిండి, భర్త నుంచి విడిపోయి లేదా భర్త వదిలివేసిన పరిస్థితిలో ఉండాలి. విడిపోయిన కాలం ఏడాదికి పైబడి ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం.

గీత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. టాడీ ట్యాపర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో సభ్యత్వంతో పాటు ప్రొహిబిషన్‌ – ఎకై ్సజ్‌ శాఖ ధ్రువీకరణ అవసరం.

చేనేత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. హ్యాండ్లూమ్స్‌ – టెక్స్‌టైల్స్‌ శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలి.

దివ్యాంగులు (రూ.4,016): వయస్సుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం ఉండాలి. ఇందుకు ఆన్‌లైన్‌ విధానంలో జారీ చేసిన యూడీఐడీ, సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

ఫైలేరియా బాధితులు (రూ.2,016): వయస్సుతో సంబంధం లేదు. గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 ఫైలేరియా బాధితులు అర్హులు. డీఎంహెచ్‌ఓ ద్వారా ధ్రువీకరణ అవసరం.

డయాలసిస్‌ రోగులు (రూ.2,016): వయస్సుతో సంబంధం లేదు. డయాలసిస్‌ చికిత్స పొందుతున్న వారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవసరం.

ఒంటరి మహిళలకు ప్రత్యేక నిబంధనలు..

ఒంటరి మహిళల విభాగంలో.. వివాహిత మహిళలు భర్త నుంచి విడిపోయిన లేదా భర్త వదిలివేసిన వారై ఉండాలి. విడిపోయిన కాలం కనీసం ఒక సంవత్సరం ఉండాలి. ఇందుకు విడాకుల పత్రం, కోర్టు ఉత్తర్వులు లేదా విడిపోవడానికి సంబంధించిన పత్రంతో పాటు తహసీల్దార్‌ నిర్వహించే స్థానిక విచారణ నివేదిక అవసరం.

వీరు పింఛన్‌ పొందేందుకు అనర్హులు

కుటుంబంలో 3 ఎకరాలకు మించి తరి (నీటిపారుదల) భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట (పొడి) భూమి ఉన్నవారు అనర్హులు.

కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగం, ఔట్‌సోర్సింగ్‌ లేదా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఉంటే అనర్హులు.

దరఖాస్తుదారుల పిల్లలు వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, ఉన్నత స్థాయి స్వయం ఉపాధిలో ఉంటే అనర్హులవుతారు.

పెద్ద వ్యాపార సంస్థలు, ఆయిల్‌ మిల్లులు, రైస్‌ మిల్లులు, పెట్రోల్‌ బంకులు, పెద్ద దుకాణాల యజమానులు.

ఇప్పటికే ప్రభుత్వ పింఛను లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పొందుతున్నవారు.

నాలుగు చక్రాల వాహనాలు (కార్లు, జీపులు), భారీ వాహనాలు (ట్రాక్టర్లు, లారీలు తదితర) ఉన్నవారు.

కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటిన వారు అనర్హులు.

జీవనశైలి, వృత్తి, ఆస్తుల ఆధారంగా కుటుంబం అనర్హమని విచారణ అధికారి భావించిన పక్షంలోనూ పింఛను నిరాకరించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement