రైతు పద్మారెడ్డిని అభినందించిన మంత్రి | - | Sakshi
Sakshi News home page

రైతు పద్మారెడ్డిని అభినందించిన మంత్రి

Aug 9 2026 2:34 AM | Updated on Aug 9 2026 2:34 AM

చందంపేట : మండలంలోని పోలేపల్లికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం హైదరాబాద్‌లో అభినందించారు. పద్మారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కుంకుడు సాగుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన బత్తాయి సాగు అభివృద్ధికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల నాగపూర్‌లోని సిట్రస్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో ఘనంగా సన్మానించారు. రైతు పద్మారెడ్డి సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల పండిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న పద్మారెడ్డిని ఇప్పటికే పలు అవార్డులు వరించాయి.

జాతీయ అథ్లెటిక్స్‌

పోటీలకు ఎంపిక

మోతె : మోతె మండల కేంద్రానికి చెందిన అప్పల వరుణ్‌ జాతీయ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన 12వ తెలంగాణ స్టేట్‌ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో వరుణ్‌ పాల్గొని ద్వితీయ స్థానం పొంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో పంజాబ్‌లో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొననున్నారు. వరుణ్‌ను సూర్యాపేట జిల్లా అథ్లెటిక్స్‌ సెక్రటరీ గడ్డం వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చెరుకు వెంకటేష్‌, కోచ్‌ పరమేష్‌ తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement