దాటుడు పండుగతో ప్రారంభించే ఈ తీజ్ వేడుకలో పెళ్లి కాని యువతులం తొమ్మిది రోజులు నిష్ఠగా పూజలు చేస్తాం. మాంసాహారం మానేసి ఉపవాస దీక్షలు ఉంటాం. ఇలా దీక్షలో ఉంటే వర్షాలు బాగా కురుస్తాయి. పాడిపంటలు పండి మానవాళికి ఏ లోటూ లేకుండా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంటారనేది మా నమ్మకం.
– వడ్త్యా నందిని, బోయిన్‌పల్లి
గిరిజన తండాల్లోని యువతులకు తీజ్ పండుగ అంటేనే ఖుషీ. ఈ వేడుక కోసం ఏడాదంతా ఎదురుచూస్తాం. మా సంప్రదాయ వస్త్రాలు ధరించి తీజ్ పండుగలో పాల్గొంటే ఆ అనుభూతే వేరు. బంధువులందరితో కలసి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సంతోషంగా గడుపుతాం.
– రమావత్ వసంత, బోయిన్‌పల్లి
తండాల్లోని యువతులు చదువు కోసం, ఉపాధి కోసం ఎక్కడా ఉన్నా తీజ్ పండుగకు తండా రావాల్సిందే. ప్రతి తీజ్ పండుగకు యువతులందరం గిరిజన ఆరాధ్య దైవాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తాం. తీజ్ చివరిరోజు మొలకల బుట్టలను నిమజ్జన సమయంలో ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. తీజ్ పండుగతో గిరిజనులలో ఐక్యత, ప్రేమానుబంధాలు బలపడుతాయి.
– వడ్త్యా శ్రావణి, బోయిన్‌పల్లి


