రాష్ట్రంలో త్వరలోనే జెన్‌ జీ ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో త్వరలోనే జెన్‌ జీ ఉద్యమం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

భువనగిరి : యువతను అణిచివేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే జెన్‌ జీ ఉద్యమం రాబోతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విద్యార్థులు, యువత ఢిల్లీలో చేసిన జెన్‌ జీ ఉద్యమంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని కదించడంతో పాటు కేంద్ర మంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిండచంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఏఐ కాదు ఏనుముల ఇంటెలిజెన్స్‌ మాత్రమే పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొల్పుల అమరేందర్‌, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌కుమార్‌, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అంజనేయులు, వైస్‌ చైర్మన్‌ కిష్టయ్య, నాయకులు సూరేపల్లి రమేష్‌, సందెల సుధాకర్‌, ఇట్టబోయిన గోపాల్‌, ఓంప్రకాష్‌, అబ్బగాని వెంకట్‌, ర్యాలక శ్రీనివాస్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఫ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాకేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement