చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

చేనేతల సంక్షేమానికి ప్రాధాన్యం

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

సాక్షి, యాదాద్రి : చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం రాయగిరి క్రాస్‌ రోడ్డు నుంచి జిల్లా కలెక్టరేట్‌ వరకు సుమారు 400 మంది చేనేత కార్మికులతో హ్యాండ్లూమ్‌ వాక్‌ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీవాణి రవికుమార్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవేజ్‌ చిస్తి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశంలతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా పోచంపల్లి ఇక్కత్‌ చీరల ప్రామాణికతను కాపాడేందుకు రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డూప్లికేట్‌ ఇక్కత్‌ చీరలను తయారీని అరికట్టేందుకే ప్రభుత్వం క్యూఆర్‌ కోడ్‌ను తెచ్చిందన్నారు. ఆధునిక డిజైన్ల తయారీకి యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌, చేనేత జౌళి శాఖల మధ్య పోచంపల్లిలో డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదిరిందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన చేనేత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో నిలబెట్టేందుకు నూతన సాంకేతికతను జోడిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన 3 జాతీయ అవార్డులు భువనగిరి జిల్లా వాసులనే వరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న కలెక్టర్‌ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం నేతన్న భరోసా పథకం కింద రూ.3,29,16,000, చేనేత రుణ మాఫీ పథకం కింద రూ.19,24,84,200తో కలిసి మొత్తం రూ.22.54 కోట్లను లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. చేనేత కార్మికులను సన్మానించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

భోజన వసతిపై అసంతృప్తి

అధికారులు చేనేత కార్మికులకు సరిపడా భోజన వసతి కల్పించకపోవడంతో కార్మికులు ఆకలితోనే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ అధికారి శ్రీనివాస్‌, యునైటెడ్‌ వే ఆఫ్‌ తిని ధులు రేఖ శ్రీనివాసన్‌, అనంతిక సింగ్‌, జెడ్పీ సీఈఓ శోభారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఫ భువనగిరిలో జాతీయ చేనేత దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement