చౌటుప్పల్ : నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా మారారని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ సర్పంచ్‌లకు ప్రభుత్వ నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ సర్పంచ్‌లు ఉన్న గ్రామాలకే తరలించుకుపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం చౌటేప్పల్‌లో నిరసన ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఆర్డీఓను నిలదీశారు. ఈ సందర్భంగా గంగిడి మనోహర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గం మొత్తానికి ఎమ్మెల్యే అన్న విషయాన్ని మరచి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చౌటుప్పల్‌లో ఓపెన్ బ్రిడ్జి నిర్మాణం జరగాల్సి ఉన్నప్పటికీ మట్టికట్టతో కూడిన అండర్‌పాస్ బ్రిడ్జి రావడానికి ఎమ్మెల్యే చేతగానితనమే కారణమన్నారు. ఇకపై వివక్ష లేకుండా నిధులు కేటాయిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్శిత్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరు వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, సీనియర్ నాయకులు శాగ చంద్రశేఖర్‌రెడ్డి, రమనగోని శంకర్, సర్పంచ్‌లు కై రంకొండ స్వప్నఅశోక్, తంగెళ్ల వెంకటేశం, నందగిరి వెంకటేశం, టేకుల మంజులదిలీప్‌రెడ్డి, బోయ దేవేంద్రమణికుమార్, సుర్వి సౌజన్యరాజు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ సీనియర్ నేత మనోహర్‌రెడ్డి


