యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు అస్తవ్యవస్తంగా మారిన పారిశుద్ధ్యాన్ని పరిశీలించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చెరువు, పెద్ద మోరీ, యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు వెళ్లే రహదారి పనుల ఆలస్యానికి గల కారణాలు, డ్రెయినేజీ నిర్మాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. పట్టణంలోని బాలిక సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి, విద్యార్ధినిలతో కలిసి ఉదయం భోజనం చేశారు. మంత్రి కొండా సురేఖ సూచనలతో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో విద్యార్ధినులకు తీసుకువచ్చిన కుర్చీలు, నోట్‌బుక్స్, టిఫిన్ బాక్స్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణిభరత్‌గౌడ్, వైస్ చైర్‌పర్సన్ రమ్య, కమిషనర్ శ్రీనివాస్, ఎంఈవో శరత్ యామిని, ఎంపీడీవో నవీన్ కుమార్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


