ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధం కావాలి

Aug 8 2026 1:05 AM | Updated on Aug 8 2026 1:05 AM

భువనగిరి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. సీపీఎం సీనియర్‌ నాయకుడు రాసాల వెంకటేష్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం రాత్రి భువనగిరి మండలంలోని బస్వాపురం గ్రామంలో స్తూపం ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. నీట్‌లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని పోరాటం చేసిన విద్యార్థులు, యువకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రోజురోజుకు విద్య, వైద్యం వ్యాపారంగా మారుస్తుందని ఆరోపించారు. ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, బాలరాజు, మల్లేశం, పాండు, కృష్ణారెడ్డి, నర్సింహ, పల్లెర్ల అంజయ్య, సర్పంచ్‌ మచ్చ భిక్షపతి, మాజీ సర్పంచ్‌ రాసాల నిర్మల, శ్రీశైలం, భాస్కర్‌ పాల్గొన్నారు.

ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement