ఆలేరురూరల్: కొలనుపాక గ్రామంలో బెల్టు షాపులు నిషేధించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరులో ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట సర్పంచ్ బెదరబోయిన యాకమ్మవెంకటేష్ ఆధ్వర్యంలో పాలకవర్గం, ప్రజలు నిరసన తెలిపారు. వారు మాట్లాడు తూ.. గ్రామంలో బెల్టు షాపులు నిషేధించాలని ఇటీవల గ్రామ సభలో తీర్మానం చేసిన కాపీని ఎకై ్సజ్, పోలీస్‌శాఖలకు అందజేసినా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు మల్లేష్, తేరాల బాలశంకర్, రమేష్, పల్లె సంపత్ పాల్గొన్నారు.


