చండూరు: చేనేత వృత్తిపై ఆధారపడిన కార్మికులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం చండూరులో చేనేత సహకార సంఘం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన చేనేత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాష్, డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ నేతతో కలిసి పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన అభిమాన నాయకుడు కొండాలక్ష్మణ్ బాపూజీ అని.. ఆయన ప్రాతినిధ్యం వహించిన స్థానంలో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అదృష్టమన్నారు. గత ప్రభుత్వం సొసైటీలకు ఎన్నికలు నిర్వహించలేదని, కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని, ఇప్పుడున్న ప్రభుత్వానికి సంకల్పం ఉంది కాబట్టే ఎన్నికలు పెట్టామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన చేనేతలకు పెన్షన్లు, రుణాలు, అర్హులకు జియో ట్యాగ్స్, ఆప్కో ద్వారా చేనేత చీరల విక్రయం లాంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పున్నా ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


