ప్రకృతి రంగులు.. అడవి మొక్కలతో చీర | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి రంగులు.. అడవి మొక్కలతో చీర

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

సంస్థాన్‌ నారాయణపురం : ప్రకృతి ప్రసాదించిన రంగులు(కూరగాయల రంగులు), అడవి మొక్కలతో తయారుచేసిన సహజ వర్ణాలు.. ప్రాచీన తేలియా రుమాల్‌ కళతో డబుల్‌ ఇక్కత్‌తో నేసిన చీర.. పుట్టపాక గ్రామానికి చెందిన చంద్రకళకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ చేనేత అవార్డును తెచ్చిపెట్టాయి. చీర తయారీలో భాగంగా నూలు దారాలను నువ్వుల నూనె, ఆముదం పొట్టు, బూడిద, గొర్రె పేడతో కలిపి 15 రోజుల పాటు నానబెట్టి శుద్ధి చేశారు. అనంతరం మజిస్టా, అడవి పసుపు, అడవి కాచు మొక్కలతో తయారుచేసిన ప్రకతి రంగులను దారాలకు అద్దారు. రెండు కొలుకుల మెట్టు పద్ధతిలో చీరను నేశారు. ప్రాసెసింగ్‌తో పాటు చీర తయారీ మొత్తం ప్రక్రియకు సుమారు ఆరు నెలల సమయం పట్టగా, చీర నేయడానికి 15 రోజులు పట్టింది. చీర తయారీకి సుమారు రూ.30 వేల వరకు ఖర్చు చేశారు. గత 36 సంవత్సరాలుగా చేనేత వృత్తిలో కొనసాగుతున్న చంద్రకళ, పెళ్లికి ముందే ఈ రంగంలో అడుగుపెట్టారు. ఈ ప్రయాణంలో తన భర్త సహకారం ఎంతో ఉందని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement