చండూరు : ఇక్కత్‌లో పోచంపల్లి స్టైల్
చీరలు తయారు చేయడం చండూరు పట్టణానికి చెందిన వర్కాల సత్యనారాయణ ప్రత్యేకత. ఈ చీర నేయడానికి 20 రోజులకు పైగా పడుతుందని, ఈ చీర ధర మార్కెట్‌లో రూ.50 వేలకు పైగా పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. 43 ఏళ్లుగా ఈ వృత్తిలోనే ఉన్నానన,ఇ గతంలో ఒకే రకం చీరలు తయారు చేసేవాళ్లమని, ఇప్పుడు పోచంపల్లి చీరలు, ఇక్కత్ రకాలకు బాగా డిమాండ్ ఉండడంతో అవి తయారు చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


