చండూరు : పట్టణానికి చెందిన కర్నాటి బొర్రయ్య తయారు చేసిన చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అవార్డు రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దాదాపుగా 55 ఏళ్లుగా మగ్గం నేస్తున్న తనకు ఎప్పుడూ ఎటువంటి అవార్డు రాలేదని, ఈ సారి తాను నేసిన ఇక్కత్ ట్విల్ వీవ్ చీరకు అవార్డు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ చీర ధర రూ.80 వేలకు పైగా ఉంటుందని, 20 రోజుల్లో ఈ చీరను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం అవార్డులతో పాటు చేనేత కార్మికులకు తగిన సహకారం అందిస్తే బాగుంటుందని ఆయన కోరుతున్నారు.


