నల్లగొండ టూటౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌కు చెందిన వాలుగొండ దశరథ తయారుచేసిన ఇక్కత్ పట్టుచీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. దశరథ వివిధ రకాల చెట్ల రసాలను సేకరించి తన అభిరుచికి తగ్గట్టుగా ఇక్కత్ పోచంపల్లి పట్టుచీరను తయారు చేశారు. ఆర్గానిక్ రంగులు అద్దిన ఇక్కత్ పోచంపల్లి పట్టుచీర నాణ్యతగా ఉండడంతో పాటు కలర్ ఏ మాత్రం ఎలిచిపోదు. గత 25 సంవత్సరాలుగా చీరలు నేస్తున్నానని, ఇప్పుడు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.


