గుండెపోటుతో తుర్కపల్లి విలేకరి మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో తుర్కపల్లి విలేకరి మృతి

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

బొమ్మలరామారం : తుర్కపల్లి మండల ‘సాక్షి’ విలేకరి దుగ్యాల రవికుమార్‌(45) గుండెపోటుతో మృతిచెందారు. కొన్ని రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్‌ కావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మూడురోజుల క్రితం ఇన్ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరగా.. బుధవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మృతిచెందారు. స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రవికుమార్‌ భౌతికకాయానికి ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చైతన్య, మాజీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ధనావత్‌ శంకర్‌ నాయక్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు చాడ భాస్కర్‌ రెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్న కిష్టయ్య, మండల అధ్యక్షుడు రవి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ సింగిరెడ్డి నర్సింహ, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌ రెడ్డి, జర్నలిస్టులు యంబ నర్సింహులు, జీ.వి శ్రీనివాస్‌, పోతంశెట్టి కరుణాకర్‌, మాటూరి వెంకటేశ్వర్లు, కళ్లెం సంపత్‌కుమార్‌, ఎడిజర్ల భూపాల్‌, భరత్‌కుమార్‌, మల్లారెడ్డి, బాల్‌కిషన్‌, జానకిరాం, ఉపేందర్‌, పాండురంగం, చంద్రశేఖర్‌, జమాలొద్దీన్‌, రమణాకర్‌, ఆనంద్‌, శ్రీనివాస్‌, అంజనేయులు, రవికుమార్‌, స్వామి, సర్పంచ్‌లు సోమోళ్ల వెంకటేష్‌, జెరిపోతుల కర్ణాకర్‌, బానోత్‌ పులి వీరన్న, సోన్నాయల రవి, పుట్ట సాయిలు, శివరాత్రి లావణ్య జహంగీర్‌, తునికి లక్ష్మి రాంరెడ్డి, రేణుక వెంకటేష్‌ యాదవ్‌, బొట్టా రాములు నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత సంతాపం తెలిపారు. రవికుమార్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని విప్‌ బీర్ల ఐలయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement