అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య | - | Sakshi
Sakshi News home page

అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

చౌటుప్పల్‌ : మండలంలోని కొయ్యలగూడెం(ప్రస్తుతం ఎల్లంబావి)కి చెందిన కర్నాటి నారాయణ–పారిజాత దంపతులు గత ఐదు దశాబ్దాలుగా చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వినూత్న డిజైన్లతో కూడిన వస్త్రాలను తయారుచేస్తూ ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో నారాయణ 2021లో ప్రకృతి సహజ సిద్ధమైన రంగులతో 24మెటీస్‌తో డబుల్‌ ఇక్కత్‌ చీర తయారు చేయడంతో ఆయనకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డు లభించింది. నారాయణ భార్య పారిజాత డబుల్‌ ఇక్కత్‌లో బ్లౌజ్‌తో కూడిన ఖాదీ కాటన్‌ చీరను తయారు చేసి ఈ ఏడాది కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డుకు ఎంపికై ంది. అంతేకాకుండా నారాయణ కుమారుడు కర్నాటి ముఖేష్‌ 2024లో 100మెటీస్‌తో డబుల్‌ ఇక్కత్‌ చీర తయారుచేసి రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి అవార్డు అందుకున్నారు. ఎప్పటికప్పుడు నూతన డిజైన్లు రూపొందిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంటున్న ఈ కుటుంబం ఇతర నేతన్నలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement