నటుడు ప్రదీప్‌ రావత్‌కు పోచంపల్లితో అనుబంధం | - | Sakshi
Sakshi News home page

నటుడు ప్రదీప్‌ రావత్‌కు పోచంపల్లితో అనుబంధం

Aug 6 2026 8:02 AM | Updated on Aug 6 2026 8:02 AM

భూదాన్‌పోచంపల్లి : పలు విజయవంతమైన చిత్రాలలో విలన్‌గా నటించిన ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ మంగళవారం ముంబైలోని తన ఇంట్లో గుండెపోటుతో మృతిచెందారు. ప్రదీప్‌ రావత్‌ షూటింగ్‌ల సందర్భంగా గతంలో పోచంపల్లికి రెండుసార్లు వచ్చారు. 2017 జనవరిలో హీరో పవన్‌కల్యాణ్‌ నటించిన కాటమరాయుడు సినిమా షూటింగ్‌ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెం గ్రామంలో జరగగా.. అందులో నటించిన ప్రదీప్‌ రావత్‌పై ఇక్కడ పలు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. అదే సంవత్సరం మార్చిలో హీరో దగ్గుబాటి రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్‌ సందర్భంగా ప్రదీప్‌ రావత్‌ పోచంపల్లికి వచ్చారు. స్థానిక టూరిజం పార్కు వద్ద చిత్రీకరించిన పలు సన్నివేశాలలో ప్రదీప్‌ రావత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement