కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా | - | Sakshi
Sakshi News home page

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా

Aug 5 2026 9:39 AM | Updated on Aug 5 2026 9:39 AM

ఐదుగురు మహిళలకు గాయాలు

నడిగూడెం : ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఐదుగురు మహిళా కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన నడిగూడెం మండలం రత్నవరం గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామాపురం గ్రామానికి చెందిన రమేష్‌ తన ఆటోలో అదే గ్రామానికి చెందిన 11 మంది మహిళా కూలీలను రత్నవరం గ్రామంలో వరి నాట్లు వేసేందుకు తీసుకెళ్తున్నాడు. రత్నవరం నుంచి తెల్లబల్లికి వెళ్లే రహదారిలో గుంతలను గమనించకుండా ఆటోను నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మందుల త్రివేణి, నేలమర్రి నాగమణి, చిన బుజ్జి, పులి ఉమ, మందుల అరుణ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

విద్యార్థులను

తల్లిదండ్రులకు అప్పగింత

సంస్థాన్‌ నారాయణపురం : మండలంలోని సర్వేల్‌ గురుకుల పాఠశాల నుంచి గోడ దూకి పారిపోయిన ఇద్దరు విద్యార్థులను తిరుపతి రైల్వే స్టేషన్‌లో గుర్తించిన పోలీసులు మంగళవారం ఉదయం పాఠశాలకు తీసుకొచ్చారు. చౌటుప్పల్‌ రూరల్‌ సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ పాండు విద్యార్థులను ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించారు. ప్రిన్సిపాల్‌ విద్యార్థులను వారి తల్లిదండ్రులను వారికి అప్పగించారు. హాస్టల్‌లో ఉండలేకే పాఠశాల నుంచి వెళ్లిపోయామని విద్యార్థులు తెలిపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement