ప్రధాన డిమాండ్లు..
రామన్నపేట: పేస్కేల్ అమలు, సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్ వేతనాల విడుదలే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. జూలై 27 నుంచి చేపట్టిన పెన్‌డౌన్ నిరసన తో జిల్లాలో ఉపాధి పనులకు ఆటంకం కలుగుతోంది.
రెండు దశాబ్దాలుగా ఒకే హోదా.. ఒకే వేతనం
జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ (వీబీ జీ రామ్ జీ) లో అదనపు ప్రోగ్రాం ఆఫీసర్లు 15 మంది, టెక్నికల్ అసిస్టెంట్‌లు 66 మంది, ఈసీలు 14మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 32మంది, జిల్లా కార్యాలయంలో 25మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2006లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన ఈ ఉద్యోగులు 20 ఏళ్లుగా గ్రామీణాభివృద్ధిశాఖకు సంబంధించిన కార్యక్రమాల అమలులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు దశాబ్దాలగా ఒకే పోస్టులో, ఒకే వేతనంతో కొనసాగుతున్నారు.
స్తంభించిన అభివృద్ధి పథకాలు
తెలంగాణ జలసిరిలో భాగంగా ఎల్నినో ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రతి గ్రామానికి ఒక ఫామ్‌పాండ్, కమ్యూనల్ ఇంకుడు గుంత నిర్మించాలనే లక్ష్యానికి సమ్మె వల్ల బ్రేక్ పడింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మస్టర్లు జనరేట్ కాకపోవడంతో లబ్ధిదారుల హాజరు నమోదు ప్రక్రియ నిలిచిపోయింది. వన మహోత్సవానికి సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాలు, సంరక్షణ పనులకు ఆటంకం ఏర్పడింది.
ఫ స్తంభించిన గ్రామీణాభివృద్ధి పనులు
ఫ జూలై 27 నుంచి పెన్‌డౌన్ చేపట్టిన ఉపాధి హామీ కాంట్రాక్ట్ ఉద్యోగులు
ఫ జలసిరి, వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్ల పనులకు ఆటంకం
ఫ 15లోగా పేస్కేల్ అమలు
చేయాలని డిమాండ్
పేస్కేలు ప్రకటించి, ఆగస్టు 15వ తేదీలోగా అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలి.
రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలి.
పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలి.
అర్హత కలిగిన సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలి.


