చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలోని శ్రీఆంథోల్ మైసమ్మ దేవాలయంలో వార్షిక బోనాల వేడుకలు సోమవారం ముగిశాయి. మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం పూర్ణాహుతి నిర్వహించి ముగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కంచర్ల అశ్విన్‌రెడ్డి, ఈఓ ఎస్. మోహన్‌బాబు, బాబు, నర్సింహ, ఆనందరెడ్డి, శివ, శ్రీకాంత్, యువరాజ్, మహేందర్‌రెడ్డి, రాజేష్, రాజేష్, రాజీవ, రమేష్, దాసు పాల్గొన్నారు.
ఆంథోల్ మైసమ్మ ఆలయంలో
పూర్ణాహుతి నిర్వహిస్తున్న భక్తులు


