డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో ఒకరికి జైలు శిక్ష

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడిన ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అతడికి రెండు రోజుల జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి తెలిపారు.

కారు ఢీకొని వ్యక్తికి గాయాలు

హుజూర్‌నగర్‌ : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన గండు సతీష్‌ సోమవారం ద్విచక్ర వాహనంపై హుజూర్‌నగర్‌ నుంచి నేరేడుచర్ల వైపు వెళ్తుండగా.. గోపాలపురం వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్‌ తలకు గాయాలయ్యాయి. స్ధానికులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు. సతీష్‌ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్యూరెన్స్‌లో పనిచేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement