● ఇద్దరిపై కేసు నమోదు
కొండమల్లేపల్లి : మండల పరిధిలోని ఆంగోతుతండాకు వెళ్లే మార్గంలో దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి అశోక్ లేలాండ్ వాహనంలో తరలిస్తున్న నల్లబెల్లం, పటికను పట్టుకున్నారు. కొండమల్లేపల్లి మండలం మేఘ్యతండాకు చెందిన ఆంగోతు తరుణ్, దేవరకొండ మండలం పడమటి తండాకు చెందిన పాత్లావత్ లాలు 2,250 కేజీల నల్లబెల్లం, 250 కేజీల పటిక తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి నల్లబెల్లం, పటికతో పాటు 5 లీటర్ల నాటుసారా, 3 మొబైల్ ఫోన్లు, వాహనాన్ని ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. వారిద్దరిని దేవరకొండ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి కోర్టుకు సరండర్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. వీరిపై గతంలో కూడా నల్లబెల్లం, నాటుసారా తరలించిన కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.


