వైభవంగా ఆంథోల్‌ మైసమ్మ బోనాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆంథోల్‌ మైసమ్మ బోనాలు

Aug 2 2026 1:16 AM | Updated on Aug 2 2026 1:16 AM

చౌటుప్పల్‌ : చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండుమల్కాపురం లోని శ్రీ ఆంథోల్‌ మైసమ్మ దేవాలయ 21వ బోనాలోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. దేవాదాయ శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా సహాయ కమిషనర్‌ కె.భాస్కర్‌రావు అఖండ దీపారాధన చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయ చైర్మన్‌ కంచర్ల అశ్విన్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి సాల్వేది మోహన్‌బాబు,ధర్మకర్తల మండలి, భక్తులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పుట్టమట్టిని సేకరించారు. ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. దాతలు కొమిరిశెట్టి విజయ్‌కుమార్‌–శిరీష దంపతుల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఈడ్దుల బాబు, బేతాల నర్సింహ, సిదిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్‌,బొంతల యువరాజు, మన్నె మహేందర్‌రెడ్డి, దేప రాజీవ, పంతంగి రమేష్‌, జొన్నగంటి దాసు, చిట్టంపల్లి సబిత, వల్లూరి శవప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement