భువనగిరి : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగోర్ల మోదీ రాందేవ్ మాట్లాడుతూ విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో నంబర్ 9ను ఆర్‌ఆర్ యాక్ట్ కింద రద్దు చేయాలన్నారు. పాత పద్ధతిలోనే బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగానలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పల్లపు దుర్గయ్య, సాయిలు, వేముల అనిల్, చిల్లర యశ్వంత్, జశ్వంత్, అరుణ్, ప్రవీణ్, శివ, లింగస్వామి, శ్రీకాంత్, లోకేష్, మానస, సంతోష, శైలజ, మౌనిక, సాత్విక, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


