భువనగిరిటౌన్ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు.. డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కృతిక, స్వాతిక్ పాల్గొన్నారు.
పకడ్బందీగా అమలు చేయాలి
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. గురువారం కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి బాలల సంక్షేమ ప్రాజెక్టు అధికారులు, సూపర్‌వైజర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కృతిక, సాత్విక్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్, బాలల సంక్షేమ ప్రాజెక్టు అధికారులు శైలజ, వెంకటరమణ, స్వరాజ్యం, నాజీ, అనంతలక్ష్మి పాల్గొన్నారు.


