బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పనిసరి

Jul 31 2026 1:27 AM | Updated on Jul 31 2026 1:27 AM

ఆలేరు : విద్యా రికార్డులు కచ్చితంగా నమోదయ్యేందుకు ప్రతి విద్యార్థికి ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ శ్రీహరి అయ్యంగార్‌ పేర్కొన్నారు. గురువారం ఆలేరులో ఏర్పాటు చేసిన యూ–డైస్‌ వర్క్‌షాప్‌తోపాటు ప్రత్యేక ఆధార్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవుతున్న ప్రతి విద్యార్థి ఆధార్‌ నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆధార్‌ లేని విద్యార్థులు పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికే ఆధార్‌ ఉన్న విద్యార్థులు బయోమెట్రిక్‌ వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలని స్పష్టం చేశారు. యూ–డైస్‌ పోర్టల్‌లో విద్యార్థుల వివరాలు కచ్చితంగా నమోదు కావాలంటే ఆధార్‌ అనుసంధానం ఎంతో కీలకమన్నారు. ఆయన వెంట కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్‌ చైతన్య,ఎల్‌డీఏ రాధిక, సీఆర్‌పీలు తిరుపతి, శ్రీనివాస్‌, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement