సాక్షి, యాదాద్రి : నిర్ణీత గడువులోగా యూనిఫాం కుట్టు పని పూర్తిచేయించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శుక్రవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, సెర్ప్ సీఈఓ దివ్య, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహనన్‌తో కలిసి పాఠశాల యూనిఫాం కుట్టు పనుల పురోగతి, సీజనల్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్.. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి మినహా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రమణారెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


