పరిశోధనల దిశగా అడుగులేద్దాం | - | Sakshi
Sakshi News home page

పరిశోధనల దిశగా అడుగులేద్దాం

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

ఆలేరు, ఆలేరు రూరల్‌ : విద్యార్థుల్లోని శాసీ్త్రయ నైపుణ్యాలను వెలికితీసేందుకు 32వ జాతీయ బాలల విజ్ఞాన సదస్సు (ఎన్‌సీఎస్‌సీ) సన్నద్ధమైంది. స్థానిక సమస్యలకు పరిష్కారం చూసేలా రూపొందించే వినూత్న ప్రాజెక్టులను ఆహ్వానిస్తోంది. 10 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, జిల్లా నుంచి అత్యధిక ప్రాజెక్టులు వెళ్లేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా విద్యా శాఖ కోరుతోంది.

2026–27 విద్యా సంవత్సరానికి..

విద్యార్థులకు కేవలం పుస్తక విజ్ఞానమే కాకుండా, ప్రయోగాత్మక పరిశోధనలపై మక్కువ పెంచేందుకు, వివిధ సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనేలా ప్రేరేపించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2026–27 విద్యా సంవత్సరానికి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌(నేషనల్‌ చిల్డ్రన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌) నిర్వహిస్తుంది. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, గురుకులాలు, ఎయిడెడ్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్ల విద్యార్థులను భాగస్వామ్యులను చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ టీచర్లతో సమన్వయం చేస్తూ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నారు.

జూనియర్‌, సీనియర్‌ గ్రూప్‌లు

6వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే 10–17 ఏళ్ల విద్యార్థులు ఎన్‌సీఎస్‌సీలో పాల్గొనేందుకు అర్హులు. ఎన్‌సీఎస్‌సీలో పాల్గొనే విద్యార్థులను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. 10–14ఏళ్ల విద్యార్థులను జూనియర్‌ గ్రూపు, 14 –17 ఏళ్ల విద్యార్థులను సీనియర్‌ గ్రూప్‌గా విభజిస్తారు.

ప్రాజెక్టుల ఎంపిక..

మొదట జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో ఎంపికై న ప్రాజెక్టులను ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి, రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ప్రాజెక్టులను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.

స్టూడెంట్‌ రిజిస్టర్‌..

ఎన్‌సీఎస్‌సీలో పాల్గొనేందుకు n-csc.in పోర్టల్‌ స్టూడెంట్‌ రిజిస్టర్‌ చేసుకోవాలి. టీచర్‌/గైడ్‌ లేదా విద్యార్థి ఈ–మెయిల్‌లో వివరాలను ఓటీపీతో నమోదు చేసుకోవాలి. వివరాల నమోదుకు ఈనెల 31 చివరి తేదీ.

ఫ సమస్యను గుర్తించు.. పరిష్కారాన్ని ఆవిష్కరించు

ఫ భావి శాస్త్రవేత్తలకు సువర్ణావకాశం

ఫ వినూత్న ప్రాజెక్టులకు సైన్స్‌ కాంగ్రెస్‌ పిలుపు

ఫ నమోదుకు 31వ తేదీ వరకు గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement