23,400 ఓట్లు తొలగింపే! | - | Sakshi
Sakshi News home page

23,400 ఓట్లు తొలగింపే!

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

సాక్షి, యాదాద్రి : ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే నకిలీ ఓట్ల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో పల్లెలు, పట్టణాల్లో ఓటుహక్కు కలిగి ఉన్నవారు, హైదరాబాద్‌లోనూ ఉన్నవారి పేర్లను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. నియోజకవర్గాల శివారులో ఉన్న చాలామందికి రెండు ఓట్లు ఉన్నాయి. గ్రామంలో ఓటు ఉంచుకోవాలా.. లేదా అనే మీమాంసలో ఇంకా కొందరు ఉన్నారు. మొత్తం ఓటర్లలో హాజరు కాని, వలసలు, మరణించిన, రెండుచోట్ల ఓట్లు ఉన్న ఓటర్ల సంఖ్యపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. పైనాలుగు కేటగిరీలను కలిపి ఓకే జాబితాగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ వివరాలన్నీ పూర్తి చేస్తే ఓటర్ల జాబితా ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 3న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

జాగ్రత్తగా తొలగింపు జాబితా

జిల్లాలో హైదరాబాద్‌తోపాటు మున్సిపల్‌ కేంద్రాలు, గ్రామాలో్‌ల్‌ రెండు, మూడు చోట్ల ఓటు హక్కుఉన్న వారిని, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని, చనిపోయిన వారిని గుర్తిస్తూ డిజిటౖలైజేషన్‌ చేసి తొలగింపు జాబితాను జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. మరణించిన వారి వివరాలను పరిశీలించి ఇంటి యజమాని లేదా కుటుంబ సభ్యుల నుంచి సంతకం తీసుకున్న తర్వాతే ఓటు తొలగిస్తున్నారు. ఇల్లు మారినా, అద్దెకు ఉండి ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారి వివరాలను ఇంటి యజమాని నుంచి వివరాలను సేకరిస్తున్నారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏల సమక్షంలో బీఎల్‌ఓలు విచారణ జరిపి వారి సమక్షంలో ఓట్లను తొలగిస్తున్నారు. జిల్లాలో డబుల్‌ ఓటర్లు, వలసలు, మృతిచెందిన వారి జాబితా ప్రకారం 23,400 వరకు ఓటర్ల ఫారాలు తిరిగి రాలేదు. ఇందులో భువనగిరి నియోజకవర్గంలో 11,400, ఆలేరు నియోజకవర్గంలో 12వేల మంది ఓటర్లు ఉన్నారు.

రెండు ఓట్ల భయంతో వెనుకంజ

జిల్లాలో పలువురికి రెండు, మూడు ఓట్ల భయం పట్టుకుంది. డీ. డూప్లీకేట్‌ సాప్ట్‌ వేర్‌ ద్వారా రెండు ఓట్ల గుర్తింపు జరుగుతోంది. ఒకటి అంతకంటే ఎక్కువ చోట్ల ఓటరు ఫారాలు సమర్పిస్తే అధికారులు ఫారం డిజిటలైజ్‌ చేసే సమయంలో దొరికిపోతారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం రెండుచోట్ల ఓట్లు నేరం. ఈ భయంతో చాలా మంది ఓట ర్లు తమ ఫారాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు.

ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌

నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్‌

భువనగిరి 2,21,903 1,99,444

ఆలేరు 2,38,040 2,25,197

ఫ ఆలేరు నియోజకవర్గంలో 12 వేలు.. భువనగిరిలో 11,400 ఓట్లు తొలగింపు జాబితాలోకి..

ఫ తుది దశకు ఎన్యుమరేషన్‌ ప్రక్రియ

ఫ ఆగస్టు 3న ముసాయిదా విడుదల

మొత్తం ఓటర్లు 4,59,943

డిజిటలైజేషన్‌ 4,35,689

తిరిగిరాని ఫారాలు 23,400

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement