విద్యార్థులు తైక్వాండో పోటీల్లో రాణించాలి
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు తైక్వాండో పోటీల్లో రాణించాలని నల్లగొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎండీ. అక్బర్ అలీ అన్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విన్నర్ వరల్డ్ తైక్వాండో అకాడమీలో నిర్వహించిన కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లో తైక్వాండో లాంటి గుర్తింపు పొందిన క్రీడలను నేర్పించడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో విద్యార్థులు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు. మునుగోడు గురుకుల బాలికల స్కూల్‌కు చెందిన 30 మంది విద్యార్థులు కలర్ బెల్ట్‌లు పొందారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ చీఫ్ ఎగ్జామినర్ ఎండీ. యూనుస్ కమాల్, మాస్టర్ అంబటి ప్రణీత్, నసీరుద్దీన్, సరయు, రణధీర్ పాల్గొన్నారు.
చెర్వుగట్టు గర్భగుడికి టేకు
తలుపులు బహూకరణ
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర ఆలయ గర్భగుడికి స్థానిక వ్యాపారి రంగా సీతయ్య, ధనమ్మ దంపతులు రూ.2 లక్షలతో టేకు తలుపులు చేయించారు. సోమవారం సీతయ్య దంపతులతో పాటు వారి కుమారులు, కోడళ్లు రామలింగయ్య, శోభ, రమేష్, శైలజ, వెంకటేశ్వర్లు, కవిత, కుమార్తె, అల్లుడు గట్టు రాధిక, గంగాధర్, మనుమలు, మనుమరాండ్లు టేకు తలుపులకు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవస్థానానికి అందజేశారు. వారికి ప్రధాన పూజారి పోతులపాటి రామలింగేశ్వశర్మ స్వాగతం పలికి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో మామిళ్లపల్లి సురేష్, శ్రీకాంత్‌శర్మ, ఉప్పల సతీష్‌శర్మ, నాగయ్యశర్మ, ఆలయ ఉద్యోగులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు తైక్వాండో పోటీల్లో రాణించాలి


