హ్యాండ్లూమ్ పార్క్‌కు నిధులు ఇవ్వండి
సాక్షి, యాదాద్రి : పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ పునరుద్ధరణకు రూ.14 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రితో పాటు కేంద్ర హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఎం. బీనాను కలిసి వినతిపత్రం అందజేశారు. పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ అభివృద్ధి పథకం కింద నిధులు అవసరమని కోరారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల బకాయిల కారణంగా హ్యాండ్లూమ్ పార్క్ నిర్వీర్యమై వేలానికి వెళ్లిందని, తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్లూమ్ పార్క్‌ను కొనుగోలు చేసి, సంప్రదాయ నేత వృత్తి దారుల జీవనోపాధిని కాపాడుతూ హ్యాండ్లూమ్ కార్యకలాపాలను పునరుజ్జీవింపజేయడానికి కట్టుబడి ఉందని వివరించారు.
ఫ కేంద్ర మంత్రిని కోరిన
ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి


